संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

మురసు తుఫాన్‌ హెచ్చరిక.. బస్సుల నిర్వహణపై RTO రాములు కీలక సూచనలు.

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
మురసు తుఫాన్‌ హెచ్చరిక.. బస్సుల నిర్వహణపై RTO రాములు కీలక సూచనలు.

खबर की मुख्य बातें

  • Uploaded Video:

ఆత్మకూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బస్సుల నిర్వహణ, ప్రయాణికుల భద్రతపై RTO రాములు కీలక సూచనలు జారీ చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉన్న ప్రాంతాల్లో రహదారుల పరిస్థితిని పరిశీలించిన తర్వాతే బస్సులు నడపాలని సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, ఘాట్‌ రోడ్లపై బస్సులను అనుమతించవద్దన్నారు. బ్రేకులు, టైర్లు, వైపర్లు, హెడ్‌లైట్లను ముందుగానే తనిఖీ చేయాలని తెలిపారు. చెట్లు, విద్యుత్‌ స్తంభాల సమీపంలో బస్సులను పార్కింగ్‌ చేయరాదన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని, రోడ్లు సాధారణ స్థితికి చేరుకున్నాకే బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *