ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ರಂಗಾರೆಡ್ಡಿ

మిస్సింగ్ వ్యక్తి ఆచూకీ కోసం విజ్ఞప్తి

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
మిస్సింగ్ వ్యక్తి ఆచూకీ కోసం విజ్ఞప్తి

రంగారెడ్డి జిల్లా: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకులగుట్ట ప్రాంతానికి చెందిన షేక్ బాషా (38), మెకానిక్ అనే వ్యక్తి కనిపించకుండా పోయారు.

అక్టోబర్ 3న రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన షేక్ బాషా, రాత్రి సుమారు 9:30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు ఆయన బైక్ తాళాలు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. అక్టోబర్ 4న ఉదయం సుమారు 7 గంటలకు కుటుంబ సభ్యులు లేచి చూడగా ఆయన ఇంట్లో కనిపించలేదు. అయితే ఆయన సెల్‌ఫోన్, బైక్ తాళాలు ఇంట్లోనే ఉన్నాయి.

కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలతో పాటు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. షేక్ బాషా ఆచూకీ తెలిసిన వారు వెంటనే హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సమాచారం కోసం:
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ – 8712662640

మిస్సింగ్ వ్యక్తి ఆచూకీ కోసం విజ్ఞప్తి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *