Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

మార్పు మీది అభివృద్ధి నాది… అనే నినాదంతో శోంఠ్యం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరుకొండ శ్రీను

Punnami Newsroom Published:
మార్పు మీది అభివృద్ధి నాది… అనే నినాదంతో శోంఠ్యం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరుకొండ శ్రీను

Story highlights

  • విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) నవంబర్ 20 :: రూ.60 లక్షలు నా సొంత నిధులతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తా!
  • మీ మున్సిబు గారి మనవడిగా మీ ముందుకు వస్తున్న శోంఠ్యం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా… ఒక్క అవకాశం ఇవ్వండి – కోరుకొండ శ్రీను శోంఠ్యం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా మరో అభ్యర్థి వినూత్న హామీలతో ముందుకొచ్చారు.
  • శోంఠ్యం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు కోరుకొండ శ్రీను మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) నవంబర్ 20 ::

రూ.60 లక్షలు నా సొంత నిధులతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తా!
మీ మున్సిబు గారి మనవడిగా మీ ముందుకు వస్తున్న

శోంఠ్యం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా… ఒక్క అవకాశం ఇవ్వండి – కోరుకొండ శ్రీను

శోంఠ్యం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా మరో అభ్యర్థి వినూత్న హామీలతో ముందుకొచ్చారు. శోంఠ్యం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు కోరుకొండ శ్రీను మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి తన అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు.

“నాపై నమ్మకం ఉంచండి… మీ అమూల్యమైన ఓటుతో నన్ను ఆశీర్వదించండి. మీ మార్పు నిర్ణయానికి అనుగుణంగా గ్రామాభివృద్ధికి నా వంతు బాధ్యత తీసుకుంటా” అంటూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు.

తనను సర్పంచ్‌గా గెలిపిస్తే రూ.60 లక్షలు సొంత నిధులతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించి కృషి చేస్తానని ప్రకటించారు.

కోరుకొండ శ్రీను ప్రధాన అభివృద్ధి హామీలు:

– ప్రతి ఇంటికీ తాగునీటి సదుపాయం కల్పించేందుకు కృషి.
– గ్రామంలోని ప్రతి సందులో సీసీ రోడ్లు వేయించడం.
– మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు.
– ప్రతి వీధిలో వీధి దీపాల సౌకర్యం.
– శ్మశానవాటికలో అవసరమైన మౌలిక వసతుల కల్పన.
– కులమత, రాజకీయ భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధి.

“సర్పంచ్ పదవి నాకు అధికారం కోసం కాదు… గ్రామానికి సేవ చేయడానికి. మీ సమస్యలను నా సమస్యలుగా భావించి, అందరినీ కలుపుకొని శోంఠ్యం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నా సంకల్పం” అని కోరుకొండ శ్రీను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఓటరు తీర్పుపైనే అందరి దృష్టి!

రూ.60 లక్షల సొంత నిధుల హామీతో కోరుకొండ శ్రీను ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆయన ప్రకటించిన హామీలు గ్రామ ప్రజల్లో ఎలాంటి స్పందన తెస్తాయి? ఓటర్లు ఈ అభివృద్ధి ప్రణాళికను ఎంతవరకు విశ్వసిస్తారు? యువత, పెద్దలు, మహిళలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఇప్పుడు శోంఠ్యంలో ఆసక్తికర చర్చగా మారింది.

మాటలతో కాదు… చేతలతో అభివృద్ధి చూపిస్తానంటున్న కోరుకొండ శ్రీనుకు ఓటర్లు ఏ మేరకు మద్దతు పలుకుతారో వేచి చూడాలి!

హామీలు ప్రజల ముందు… నిర్ణయం ఓటర్ల చేతుల్లో… శోంఠ్యం భవిష్యత్తును నిర్ణయించేది ప్రజల ఓటే!

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *