Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Khammam

మార్కెట్ కమిటీ కార్యదర్శిగా దుగ్గిరాల నిర్మల.

Punnami Newsroom Published:
మార్కెట్ కమిటీ కార్యదర్శిగా దుగ్గిరాల నిర్మల.

Story highlights

  • మార్కెట్ కమిటీ కార్యదర్శిగా దుగ్గిరాల నిర్మల.
  • ఏన్కూరు: ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేటు కార్యదర్శిగా దుగ్గిరాల నిర్మల బాధ్యతలు స్వీకరించారు.
  • ఇక్కడ పని చేసినటువంటి బజార్ గత మూడు నెలల క్రితం రిటైర్మెంట్ అయ్యారు.

మార్కెట్ కమిటీ కార్యదర్శిగా దుగ్గిరాల నిర్మల.

ఏన్కూరు:

ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేటు కార్యదర్శిగా దుగ్గిరాల నిర్మల బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసినటువంటి బజార్ గత మూడు నెలల క్రితం రిటైర్మెంట్ అయ్యారు. అనంతరం ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ అనుష కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. నిర్మల బూర్గంపాడులో కార్యదర్శిగా పనిచేస్తూ పదోన్నతి పై గ్రేడ్(2)గా గురువారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ మార్కెట్ కమిటీకి వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనూష, డిఓ సురేష్, సిబ్బంది రవీందర్, ఇండ్ల నరేష్, పాశం నరేష్, మంకెన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *