Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా

Punnami Newsroom Published: Updated:
మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా

మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా

సెప్టెంబర్ 20( మార్కాపురం కె టి సి పున్నమి ప్రతినిధి)
నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు మొట్టమొదటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)గా పంకజ్ కుమార్ మీనా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2020 బ్యాచ్ IPS అధికారి అయిన పంకజ్ కుమార్ మీనా స్వస్థలం రాజస్థాన్.
2019లో నిర్వహించిన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపికైన ఆయన, 9 డిసెంబర్ 2023న IPS ధ్రువీకరణ పొందారు. నూతన మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా ఆయన నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం వంటి అంశాల్లో పోలీసు శాఖను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
అధికారి వివరాలు: పంకజ్ కుమార్ మీనా | IPS బ్యాచ్: 2020 | క్యాడర్: ఆంధ్రప్రదేశ్ | స్వస్థలం: రాజస్థాన్ | UPSC ఎంపిక: సివిల్ సర్వీసెస్ పరీక్ష–2019 | IPS ధ్రువీకరణ: 9 డిసెంబర్ 2023.
మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న పంకజ్ కుమార్ మీనా గారికి శుభాకాంక్షలు. 🌹

మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా

మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *