Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Chittoor

మాజీ సైనికుల ఆత్మీయ సమావేశంలో ఆకట్టుకున్న నాంపల్లి చక్రి

Punnami Newsroom Published: Updated:
మాజీ సైనికుల ఆత్మీయ సమావేశంలో ఆకట్టుకున్న నాంపల్లి చక్రి

Story highlights

  • ఐరాల: జై జవాన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కాణిపాకంలో మాజీ సైనికుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం సేవలందించిన పలువురు మాజీ సైనికులను ఘనంగా సన్మానించి, దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు.
  • సైనికుల సేవలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఐరాల: జై జవాన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కాణిపాకంలో మాజీ సైనికుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం సేవలందించిన పలువురు మాజీ సైనికులను ఘనంగా సన్మానించి, దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. సైనికుల సేవలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఐరాల మండలం అగ్రహారపల్లికి చెందిన నాంపల్లి చక్రి ప్రదర్శించిన నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తన కళా ప్రతిభతో చక్రి సభికులను అలరించారు. నృత్య ప్రదర్శన అనంతరం ఆయన ప్రతిభను అభినందిస్తూ డిఫెన్స్ వెటరన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస నాయుడు శాలువా కప్పి, మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ సైనికులు, సైనిక కుటుంబాల సభ్యులు నాంపల్లి చక్రిని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *