Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

మహా కూటమి విజయోత్సవ సంబరాలు కార్యకర్తల కష్టాన్ని ప్రజలే పట్టాభిషేకం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Punnami Newsroom Published:
మహా కూటమి విజయోత్సవ సంబరాలు కార్యకర్తల కష్టాన్ని ప్రజలే పట్టాభిషేకం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

మైలవరంలో కూటమి విజయోత్సవ సంబరాలు.. కార్యకర్తల కష్టానికి ప్రజల పట్టాభిషేకం!

ఐక్యతే మన బలం.. గ్రామగ్రామాన అభివృద్ధి సాధించడమే లక్ష్యం.

కొండపల్లి పురపాలక సంఘంలో 40కి 33..

ఐదు మండలాల్లో 73కి 62 ఎంపీటీసీ స్థానాలు..

ఐదింటికి ఐదు జడ్పీటీసీ స్థానాలు కూటమి కైవసం

గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది..

రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ఐక్యత కొనసాగాలి:

-మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు

ఐతవరం, 10/11/2026.

మైలవరం నియోజకవర్గంలో కూటమి సాధించిన స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, కూటమి పార్టీల ఐక్యతకు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేసిన అవిశ్రాంత కృషికి నిదర్శనమని మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఎన్నికల్లో సాధించిన విజయాలతో బాధ్యత మరింత పెరిగిందని, రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే సమన్వయం, ఐక్యతతో ముందుకు సాగి ప్రతి గ్రామంలో కూటమి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

మంగళవారం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి స్వగ్రామమైన ఐతవరంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత అన్న ఎన్టీఆర్ గారి ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన విజయోత్సవ సన్మాన సభలో కూటమి తరఫున ఎన్నికల్లో విజయం సాధించిన పురపాలక సంఘ కౌన్సిలర్లు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, జనసేన మైలవరం నియోజకవర్గ బాధ్యులు అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో జరుగుతున్న ఈ ఆత్మీయ సమావేశం వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైనదని, ఇది కేవలం విజయోత్సవం, సన్మాన కార్యక్రమం మాత్రమే కాదని, మూడు పార్టీల మధ్య ఉన్న ఐక్యతకు, కార్యకర్తల శ్రమకు, ప్రజల విశ్వాసానికి ప్రతిబింబమని అన్నారు.

కూటమికి ప్రజల తిరుగులేని మద్దతు.

మైలవరం నియోజకవర్గంలో కూటమి సాధించిన విజయాలను వివరిస్తూ కొండపల్లి పురపాలక సంఘంలో కూటమి తరఫున పోటీ చేసిన 40 మంది అభ్యర్థుల్లో 33 మంది కౌన్సిలర్లుగా విజయం సాధించారని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 73 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు గాను 62 స్థానాలను కైవసం చేసుకున్నామని, ఐదు జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలనూ ఐదింటినీ గెలుచుకున్నామని వెల్లడించారు. ఈ ఫలితాలు కూటమిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని, అభివృద్ధి పట్ల వారు వ్యక్తం చేసిన ఆకాంక్షను స్పష్టంగా తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ విజయాలు ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క నాయకుడికో పరిమితం కావని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమష్టిగా చేసిన కృషికి దక్కిన ఫలితమని చెప్పారు. అంతిమంగా ఇది ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు.

యార్లగడ్డ వెంకట్రావు గారి సమన్వయంతో.. 7,400 ఓట్ల మెజారిటీ.

విజయవాడ గ్రామీణ మండలానికి సంబంధించిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం గురించి ప్రస్తావిస్తూ.. ఆ మండలంలోని కొన్ని గ్రామాలు మైలవరం నియోజకవర్గంలో, మరికొన్ని గన్నవరం నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారితో చర్చించి కూటమి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం కూటమి పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించిందని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారని తెలిపారు. ఫలితంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్థి 7,400 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారని చెప్పారు.

మైలవరం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి కూడా ఈ విజయానికి విశేషమైన మద్దతు లభించిందని, అక్కడి 14 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో 13 స్థానాలను గెలుచుకోవడంతో పాటు దాదాపు 9,000 ఓట్ల మెజారిటీ సాధించడం కూటమి బలాన్ని చాటిందని పేర్కొన్నారు. సమన్వయంతో ముందుకు సాగితే ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని ఈ ఫలితాలు నిరూపించాయని అన్నారు.

ఇబ్రహీంపట్నంలో 11కి 11.. కార్యకర్తల్లో ఉత్సాహం

ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న మొత్తం 11 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలనూ కూటమి కైవసం చేసుకోవడంపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. సరదాగా మాట్లాడుతూ.. ఇకపై ఇబ్రహీంపట్నంలో 11 అనే సంఖ్య వినిపించినప్పుడల్లా ఈ ఎన్నికల ఫలితాలే గుర్తుకు రావాలని చమత్కరించారు. అయితే రాజకీయాల్లో ప్రత్యర్థులను ఓడించడం కంటే ప్రజల మనసులను గెలుచుకోవడమే ముఖ్యమని, మన విజయం ఎవరికీ వ్యతిరేకంగా కాకుండా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఉండాలని హితవు పలికారు.

పంచాయతీ ఎన్నికలే తదుపరి లక్ష్యం.

ప్రస్తుత విజయాలతోనే సంతృప్తి చెందకుండా రానున్న పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, పురపాలక సంఘ కౌన్సిలర్లుగా విజయం సాధించడం ఒక బాధ్యతకు ఆరంభం మాత్రమేనని, ప్రతి గ్రామంలోకి వెళ్లి, ప్రతి ఇంటినీ సందర్శించి, ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించాలని సూచించారు.

మనకు ఓటు వేసిన వారితో పాటు ఓటు వేయని వారినీ సమానంగా గౌరవించాలని, ఎన్నికల సమయంలోనే కాకుండా ఎన్నికల అనంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులుగా గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేయాలని కోరారు.

మూడు పార్టీల ఐక్యతే కూటమి విజయానికి పునాది.

తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య స్థానికంగా చిన్నచిన్న అభిప్రాయ భేదాలు, సమస్యలు ఉండవచ్చని, వాటిని పక్కనపెట్టి కూటమి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్తను, జనసేన కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, భారతీయ జనతా పార్టీ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తను గౌరవించుకోవాలని అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే అంశాన్ని పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని, అయితే అభ్యర్థి ఎవరైనా కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. కూటమి ఐక్యతను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే మనందరి బాధ్యతని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం.

ఎన్నికల్లో గెలుపొందిన మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, పురపాలక సంఘ కౌన్సిలర్లు, చైర్మన్‌కు ఎమ్మెల్యే ప్రత్యేకంగా సూచనలు చేశారు. ప్రజలు తమకు అప్పగించిన పదవులను అధికారంగా కాకుండా బాధ్యతగా భావించాలని, గెలిచిన ప్రాంతంలో తమకు ఓటు వేసిన వారే కాకుండా ఓటు వేయని వారు కూడా సమానంగా తమ ప్రజలేనని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని, వారి సమస్యలను ఓపికగా విని, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన విజయాన్ని అహంకారంగా కాకుండా మరింత సేవ చేసే అవకాశంగా భావించాలని హితవు పలికారు.

కార్యకర్తల శ్రమకు హృదయపూర్వక అభినందనలు.

ఈ ఎన్నికల్లో ఎండనక, వాననక కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు కృతజ్ఞతలు తెలిపారు. రాత్రింబవళ్లు శ్రమించిన వారు, ఇంటింటికీ తిరిగి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వారు, నాయకులు, అభిమానులు, మూడు పార్టీల శ్రేణుల సమష్టి కృషి వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని కొనియాడారు. పార్లమెంటు సభ్యులు, మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు అందించిన సహకారం కూడా విజయానికి కీలకమని పేర్కొన్నారు.

కొండపల్లి పురపాలక సంఘంలో 33 స్థానాలతోనో, మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో 62 విజయాలతోనో, జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో ఐదింటికి ఐదు స్థానాల విజయంతోనో ఆగిపోకూడదని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూటమి జెండా ఎగరాలన్నదే మన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రతి కార్యకర్త గర్వంగా తలెత్తుకుని నిలబడేలా ప్రజాసేవ సాగాలని ఆకాంక్షించారు. మైలవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై కూటమి, జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను

మహా కూటమి విజయోత్సవ సంబరాలు కార్యకర్తల కష్టాన్ని ప్రజలే పట్టాభిషేకం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

మహా కూటమి విజయోత్సవ సంబరాలు కార్యకర్తల కష్టాన్ని ప్రజలే పట్టాభిషేకం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *