ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಡಾ. ಬಿ.ಆರ್. ಅಂಬೇಡ್ಕರ್ ಕೋನಸೀಮ

మస్కట్‌లో చిక్కుకున్న మహిళకు అండగా నిలిచిన మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
మస్కట్‌లో చిక్కుకున్న మహిళకు అండగా నిలిచిన మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన శ్రీమతి నక్కిడపు ప్రశాంతిని మస్కట్‌ నుంచి మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ అధికారులు సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు.
  • కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె 2026 మేలో బి.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన శ్రీమతి నక్కిడపు ప్రశాంతిని మస్కట్‌ నుంచి మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ అధికారులు సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె 2026 మేలో బి. రాంబాబు అనే ఏజెంట్ ద్వారా ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడ అధిక పని ఒత్తిడి, ఎక్కువ మంది పిల్లలను చూసుకోవాల్సి రావడం, సరైన నిద్ర లేకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఆశ్రయించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఆదేశాల మేరకు అధికారులు స్పందించి సంబంధిత ఏజెంట్‌తో సంప్రదింపులు జరిపారు. అవసరమైన చర్యలు చేపట్టి ప్రశాంతిని సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని నోడల్ అధికారి వి. సుబ్బారావు, సమన్వయకర్త గోళ్ళ రమేష్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *