Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Annamayya

మగ్ధూమ్ బాబా దర్గా ఉరుసులో జనసేన నాయకులు

Punnami Newsroom Published:
మగ్ధూమ్ బాబా దర్గా ఉరుసులో జనసేన నాయకులు

Story highlights

  • కొట్టే శ్రీహరి, ఉల్లి ఉపేంద్ర కుటుంబ సమేతంగా హాజరు నందలూరు: నందలూరు మండలంలో ప్రసిద్ధి చెందిన మగ్ధూమ్ బాబా దర్గా ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి.
  • దర్గా చిన్న గురువులయ్య పీఠాధిపతుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యులు కొట్టే శ్రీహరి, జనసేన నాయకులు ఉల్లి ఉపేంద్ర కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
  • దర్గాకు చేరుకున్న నాయకులకు పెద్ద గురువులయ్య హజరత్ ఖ్వాజా సయ్యద్ షా మొహమ్మద్ మొయుద్దిన్ హుసేని రాజ్వి ఖాద్రి ఉరఫ్ జునైద్ బగ్దాది సాహెబ్, చిన్న పీఠాధిపతి గురువులయ్య హైదర్ సాహెబ్, ముజావర్లు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

కొట్టే శ్రీహరి, ఉల్లి ఉపేంద్ర కుటుంబ సమేతంగా హాజరు
నందలూరు: నందలూరు మండలంలో ప్రసిద్ధి చెందిన మగ్ధూమ్ బాబా దర్గా ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దర్గా చిన్న గురువులయ్య పీఠాధిపతుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యులు కొట్టే శ్రీహరి, జనసేన నాయకులు ఉల్లి ఉపేంద్ర కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

దర్గాకు చేరుకున్న నాయకులకు పెద్ద గురువులయ్య హజరత్ ఖ్వాజా సయ్యద్ షా మొహమ్మద్ మొయుద్దిన్ హుసేని రాజ్వి ఖాద్రి ఉరఫ్ జునైద్ బగ్దాది సాహెబ్, చిన్న పీఠాధిపతి గురువులయ్య హైదర్ సాహెబ్, ముజావర్లు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, మంగళహారతుల మధ్య వారిని దర్గాలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక దువా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా కొట్టే శ్రీహరి మాట్లాడుతూ.. మగ్ధూమ్ బాబా దర్గా ఉరుసు మహోత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. కులమతాలకు అతీతంగా మానవత్వం, సోదరభావం, సామరస్యాన్ని చాటే ఇలాంటి పవిత్ర వేడుకలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. మగ్ధూమ్ బాబా ఆశీస్సులతో నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఉరుసు వేడుకలకు ఆహ్వానించి ఘనంగా స్వాగతించిన పీఠాధిపతులు, ముజావర్లకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *