ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಶ್ರೀ ಪೊಟ್ಟಿ ಶ್ರೀರಾಮುಲು ನೆಲ್ಲೂರು

భైరవరం సచివాలయంలో రైతుల ఈ-కేవైసీ

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
భైరవరం సచివాలయంలో రైతుల ఈ-కేవైసీ

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • దుత్తలూరు మండలం భైరవరం సచివాలయంలో శుక్రవారం రైతులు ఈ-కేవైసీ నమోదు కోసం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
  • కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నగదు సాయం పొందేందుకు ఈ-కేవైసీ తప్పనిసరి కావడంతో రైతులు సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
  • ఆధార్ వివరాలు, మొబైల్ నంబర్ తదితర వివరాలను పరిశీలించి ఈ-కేవైసీ నమోదు చేస్తున్నారు.

దుత్తలూరు మండలం భైరవరం సచివాలయంలో శుక్రవారం రైతులు ఈ-కేవైసీ నమోదు కోసం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నగదు సాయం పొందేందుకు ఈ-కేవైసీ తప్పనిసరి కావడంతో రైతులు సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఆధార్ వివరాలు, మొబైల్ నంబర్ తదితర వివరాలను పరిశీలించి ఈ-కేవైసీ నమోదు చేస్తున్నారు. పథకం ద్వారా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు తెలిపారు. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే సచివాలయాన్ని సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *