Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
BHUPALPALLE

భూపాలపల్లి ఎస్ ఆర్ డిజి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణ

Punnami Newsroom Published:
భూపాలపల్లి ఎస్ ఆర్ డిజి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణ

భూపాలపల్లి: సెప్టెంబర్ 5: పున్నమి ప్రతినిధి: ఎస్ ఆర్ డిజి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. పాఠశాల ప్రిన్సిపల్ రసజ్ఞగా వ్యవహరించి, పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుల పాత్రను పోషించారు. అన్ని సబ్జెక్టులను విద్యార్థులకు బోధించడం కార్యక్రమంలో ప్రధాన అంశంగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నట్లు, ఆయన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను అధిరోహించిన విషయాన్ని వివరించారు. రాధాకృష్ణ గారు గొప్ప తత్వవేత్తగా ఉందని, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేవారిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

భూపాలపల్లి ఎస్ ఆర్ డిజి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణ

భూపాలపల్లి ఎస్ ఆర్ డిజి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *