హయత్‌నగర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హయత్‌నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు సమర్పించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కళ్లెం నవజీవన్ రెడ్డి తల్లి కళ్లెం కళావతి, సతీమణి కళ్లెం నవీన, కుమారులు వార్షిక్ రెడ్డి, శుశాంత్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆలయంలో భక్తి వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
