Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

బీ సి ఉద్యమం ఆగదు.. ఐక్య పోరాటాలే మార్గం : బీజేపీ ఏం పి ఈటెల రాజేంద్ర

Punnami Newsroom Published:
బీ సి ఉద్యమం ఆగదు.. ఐక్య పోరాటాలే మార్గం : బీజేపీ ఏం పి ఈటెల రాజేంద్ర

Story highlights

  • పున్నమి ప్రతి నిధి హైదరాబాద్, జూబ్లీ బస్ స్టేషన్: బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో భాగంగా, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
  • బీసీ ఉద్యమం కేవలం ఓ పార్టీకి సంబంధించినదేగా కాదు, ఇది 52 శాతం ప్రజల ఆకాంక్షల తిప్పలు అని ఆయన స్పష్టం చేశారు.
  • "తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన విధంగా, బీసీ రాజ్యాధికారం సాధ్యమే.

పున్నమి ప్రతి నిధి

హైదరాబాద్, జూబ్లీ బస్ స్టేషన్: బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో భాగంగా, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ ఉద్యమం కేవలం ఓ పార్టీకి సంబంధించినదేగా కాదు, ఇది 52 శాతం ప్రజల ఆకాంక్షల తిప్పలు అని ఆయన స్పష్టం చేశారు.

“తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన విధంగా, బీసీ రాజ్యాధికారం సాధ్యమే. మేము యాచించే స్థాయిలో కాదు, శాసించే స్థాయిలో ఉండాలన్నది మా ఆశయం” అని ఈటల అన్నారు. బీసీలకు చట్టసభల్లో పూర్తి రిజర్వేషన్లు రావాలని, మంత్రివర్గంలో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.

ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ రిజర్వేషన్ల విషయంలో మోసం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలకూ, ఇప్పటి చర్యలకూ పొంతన లేదని ఎత్తిచూపారు. “రిజర్వేషన్ల పెంపు రాష్ట్రాల పరిధిలో లేదని రేవంత్ అన్నవీడియో ఉంద”ని అన్నారు.

తెలంగాణలో బీసీ సీఎం అవసరమని, రాష్ట్రంలో బీసీలు శక్తివంతమైన రాజకీయం చేసేందుకు ఇది సరైన సమయం అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు మాదిరిగా చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు.

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతం కాగా, అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని ఈటల పిలుపునిచ్చారు. “ఈ ఉద్యమం నిలిచిపోదు. ప్రతి బీసీ ఇంట్లో రాజ్యాధికారం సాధించాలనే తపన ఉంది” అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *