Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Khammam

బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దౌర్జన్యం దారుణం ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజలు సహించరు: మాజీ ఎంపీ నామ

Punnami Newsroom Published:
బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దౌర్జన్యం దారుణం ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజలు సహించరు: మాజీ ఎంపీ నామ

Story highlights

  • ఖమ్మం: అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.
  • నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను బలవంతంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.
  • అరెస్టు సందర్భంగా కేటీఆర్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు.

ఖమ్మం: అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను బలవంతంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. అరెస్టు సందర్భంగా కేటీఆర్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. పోలీసుల తోపులాటలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి స్వల్ప గాయాలు కావడం విచారకరమన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావును తోపులాటలో కిందపడేలా చేయడం శోచనీయమన్నారు.
మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి పట్ల వ్యవహరించిన తీరు ఇదేనా అని నామ ప్రశ్నించారు. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలనే లాక్కెళ్లడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేతలపై పోలీసులు బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ నిరసనలు చేస్తే ప్రజాస్వామ్యం, తెలంగాణలో బీఆర్ఎస్ నిరసన చేస్తే అరెస్టులా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు నల్లచొక్కాలు ధరించి వెళ్తే తప్పులేదు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కాంగ్రెస్‌కు కేంద్రంలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గొంతు నొక్కాలని చూస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని నామ నాగేశ్వరరావు హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *