संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో “ప్రజా భిక్షాటన”విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో “ప్రజా భిక్షాటన”విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు

खबर की मुख्य बातें

  • ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం నంద్యాల అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు అనగా శుక్రవారం ఉదయం 9.30 గంటలకు గాంధీ చౌక్‌లో “ప్రజా భిక్షాటన” కార్యక్రమం నిర్వహించనున్నట్లు అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ ఏరువ రామచంద్రారెడ్డి ప్రకటించారు.గురువారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయంలో ఒక…
  • నంద్యాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, యువత, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని “ప్రజా భిక్షాటన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో నిట్టూరు సుధాకర్ రావు, బిజ్జల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం నంద్యాల అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు అనగా శుక్రవారం ఉదయం 9.30 గంటలకు గాంధీ చౌక్‌లో “ప్రజా భిక్షాటన” కార్యక్రమం నిర్వహించనున్నట్లు అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ ఏరువ రామచంద్రారెడ్డి ప్రకటించారు.గురువారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయంలో
ఒక ప్రకటన విడుదల చేసారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..నూనెపల్లె మార్కెట్ యార్డు భూమిలో రెండు ఎకరాలను రాజకీయ పార్టీకి కేటాయించడాన్ని రద్దు చేయడం, RARS ప్రాంగణంలోని తాత్కాలిక కలెక్టరేట్‌ను అక్కడి నుంచి తరలించడం ప్రధాన డిమాండ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు.రెండు ఎకరాల భూమిని 33 సంవత్సరాలకు కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి లభించేది కేవలం ₹66,000 మాత్రమేనని పేర్కొంటూ, ఆ ₹66,000 మొత్తాన్ని ప్రజల నుంచి భిక్షాటన రూపంలో సమీకరించి ప్రభుత్వానికి అందజేయడం ద్వారా ప్రజా ఆస్తులను కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.అదేవిధంగా, RARS నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను తరలించేందుకు అవసరమైన నిధులను కూడా ప్రజల నుంచి సమీకరించేందుకు కూఅ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, యువత, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని “ప్రజా భిక్షాటన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో నిట్టూరు సుధాకర్ రావు, బిజ్జల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *