Story highlights
- నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఘటన ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
- చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- ఈ ఘటనలో గ్రామానికి చెందిన కొలకలూరి నిశాంత్ (ఆరవ తరగతి), కండ్లగుంట నాగచైతన్య (ఆరవ తరగతి) మృతి చెందినట్లు సమాచారం.
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఘటన
ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనలో గ్రామానికి చెందిన కొలకలూరి నిశాంత్ (ఆరవ తరగతి), కండ్లగుంట నాగచైతన్య (ఆరవ తరగతి) మృతి చెందినట్లు సమాచారం. విద్యార్థుల మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.
చిన్న వయస్సులోనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
పున్నమి న్యూస్ విజ్ఞప్తి: పిల్లలు చెరువులు, కాలువలు, ఇతర నీటి ప్రాంతాల వద్దకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈత రాని పిల్లలను నీటిలోకి దిగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
— పున్నమి న్యూస్