Story highlights
- పొదలకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కూటమి బలపరిచిన కాసా శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు.
- స్థానిక ఆంజనేయస్వామి ఆలయం నుంచి వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సచివాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.
- కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో తాగునీటి సౌకర్యం, మురుగునీటి కాలువలు, సెంట్రల్ లైటింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చామని నాయకులు తెలిపారు.
పొదలకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కూటమి బలపరిచిన కాసా శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం నుంచి వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సచివాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో తాగునీటి సౌకర్యం, మురుగునీటి కాలువలు, సెంట్రల్ లైటింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చామని నాయకులు తెలిపారు. సర్పంచ్‌తో పాటు అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విజయాన్ని కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.
News Sources
- Punnami ReportingOwn reporting