खबर की मुख्य बातें
- పాడేరు, అక్టోబర్ 08: 2026–27 ఎక్సైజ్ పాలసీలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో A4 మద్యం దుకాణాల నిర్వహణకు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గౌరీశ్వరరావు తెలిపారు.
- జిల్లా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మూడు A4 దుకాణాలు నోటిఫై చేయగా, పెదబయలు మండలంలోని నాన్-రిన్యూడ్ దుకాణానికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి.
- అర్హత పరిశీలన అనంతరం గురువారం జాయింట్ కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారు.
పాడేరు, అక్టోబర్ 08: 2026–27 ఎక్సైజ్ పాలసీలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో A4 మద్యం దుకాణాల నిర్వహణకు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గౌరీశ్వరరావు తెలిపారు. జిల్లా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మూడు A4 దుకాణాలు నోటిఫై చేయగా, పెదబయలు మండలంలోని నాన్-రిన్యూడ్ దుకాణానికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. అర్హత పరిశీలన అనంతరం గురువారం జాయింట్ కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారు. మిగిలిన రెండు దుకాణాల్లో జి.కె.వీధి మండలం సీలేరు నాన్-రిన్యూడ్, జి.మాడుగుల నాన్-ఫంక్షనింగ్ దుకాణాలు ఉన్నాయి. వీటికి అక్టోబర్ 10న తాజా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్లోని నిబంధనలు, అర్హతలు, గడువును పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.