Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

పెదపూడి మండలంలో రూ.4.70 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

Punnami Newsroom Published: Updated:
పెదపూడి మండలంలో రూ.4.70 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

రెండేళ్లలో రూ.278 కోట్లతో అభివృద్ధి పనులు: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

పెదపూడి, అక్టోబరు 9 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలంలో రూ.4.70 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రారంభించారు. మండలంలో గత రెండేళ్లలో సుమారు రూ.278 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పురందేశ్వరి తెలిపారు.

గొల్లల మామిడాడలో రూ.35 లక్షలు, రూ.25 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను, కుమారప్రియంలో రూ.1.90 కోట్లతో అభివృద్ధి చేసిన బీటీ రోడ్డును, రూ.15.50 లక్షలతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ ప్రహరీని ప్రారంభించారు. శ్రీ రాజరాజేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దాత మాగం సత్యనారాయణ అందించిన రూ.10 లక్షల విరాళంతో నిర్మించిన రేకుల షెడ్డును ప్రారంభించారు. పెదపూడిలో రూ.1.75 కోట్లతో అభివృద్ధి చేసిన సీసీ రోడ్డును, రూ.30 లక్షలతో నిర్మించిన గాంధీ స్మారక జెడ్పీ హైస్కూల్ ప్రహరీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత అవకాశం ఏర్పడిందన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణం, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావడం, రైల్వే జోన్‌తో పాటు రహదారులు, రైల్వే సదుపాయాల కల్పనలో కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు. అనపర్తి ప్రాంత ప్రజల సౌకర్యార్థం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సాధించడం కూడా ఈ సహకారంలో భాగమన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019–2024 మధ్య అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారుల నిర్మాణం పూర్తవుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’కు అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గ, పెదపూడి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, గొల్లల మామిడాడ, కుమారప్రియం, పెదపూడి గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పెదపూడి మండలంలో రూ.4.70 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

పెదపూడి మండలంలో రూ.4.70 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

పెదపూడి మండలంలో రూ.4.70 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

పెదపూడి మండలంలో రూ.4.70 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

పెదపూడి మండలంలో రూ.4.70 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

పెదపూడి మండలంలో రూ.4.70 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *