खबर की मुख्य बातें
- పామూరు, నవంబర్ 10(పున్నమి తెలుగు దినపత్రిక )..
- పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల నాగరాలో భాగంగా నవంబర్ 13 తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది..
- పట్టణ జనాభా, కులాల ప్రాతిపదికన ఎన్నికల నియమావళి ప్రకారం ఈ సారి పామూరు మేజర్ పంచాయతీ కి బి.
పామూరు, నవంబర్ 10(పున్నమి తెలుగు దినపత్రిక ).. పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల నాగరాలో భాగంగా నవంబర్ 13 తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది.. పట్టణ జనాభా, కులాల ప్రాతిపదికన ఎన్నికల నియమావళి ప్రకారం ఈ సారి పామూరు మేజర్ పంచాయతీ కి బి. సి.రిజర్వేషన్ ప్రాధాన్యత దక్కడం విశేషం..అయినా బి. సి. కులాల్లో సింహభాగం ఓటింగ్ కల్గిన ముస్లిం మైనారిటీ సోదరులకు పామూరు సర్పంచ్ పీఠం అందని ద్రాక్ష గానే మిగిలిపోయిన వైనం..స్థానిక పాలకుల, నాయకుల ఆధిపత్య పోరులో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి సర్పంచ్ అవ్వాలనే కోరిక, కల గానే మిగిలిపోయింది..చట్ట సభల్లో బి. సి. కులాలకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం, పట్టణం లో ఎక్కువ ఓటింగ్ జనాభా కల్గిన ముస్లిం మైనారిటీలకు సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం స్థానిక నాయకులు ఇవ్వాలని, లేకపోతే, వారికి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం..సామాజిక, ఆర్ధిక రంగాల్లో ముందు వరుసలో వున్న ముస్లిం సోదరులకు సర్పంచ్ అయ్యే అవకాశం ఇవ్వాలని, లేకపోతే అందరు కల్సి పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో ఏ పార్టీ లోని అభ్యర్థి నైనా ఎన్నుకుంటామని పామూరు ముస్లిం మతపెద్దల తెలిపారు..దేవుడు వరమిచ్చిన గుడిపూజారి అనుమతి కావాల్లన్నట్టు వ్యవహరించి ముస్లిం లను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..బి.సి కులాల్లో అధిక ఓటింగ్ శాతం గల ముస్లింలకు ప్రాధాన్యతనిచ్చి గౌరవించాలని,లేకపోతే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కారల్ మర్క్స్ చెప్పిన నినాదంతో ముందుకు సాగుతామని పట్టణ ముస్లిం ఓటర్లు అంటున్నారు..స్థానిక అధినాయకుడు బి. సి. కులాల్లో ఏ కులానికి సర్పంచ్ అయ్యే అవకాశం ఇస్తారో, ఇంకా రెండు రోజులు ఎదురుచూసే పరిస్థితి..