संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నె.ర.సం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ ఉగాది సత్కారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నె.ర.సం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ ఉగాది సత్కారం

खबर की मुख्य बातें

  • .....
  • ప్రాచీన క ళలను సంస్కృతిని ఆదరించవలసిన బాధ్యత అందరిపై ఉందనిజిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ మేకపాటి శాంతకుమారి అన్నారు.
  • ఆదివారం నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా గ్రంధాలయంలో నిర్వహించిన శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పురస్కారాలు కవి సమ్మేళనం కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

….. ప్రాచీన క ళలను సంస్కృతిని ఆదరించవలసిన బాధ్యత అందరిపై ఉందనిజిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ మేకపాటి శాంతకుమారి
అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా గ్రంధాలయంలో నిర్వహించిన శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పురస్కారాలు కవి సమ్మేళనం కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీవీలు సెల్ఫోన్ వల్ల విద్యార్థులలో సామాజిక స్పృహ తగ్గిందని ప్రాచీన కళలను ఆరాధించడం తగ్గిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి వస్తున్న భారతదేశ సంస్కృతి తెలియజేసే భరతనాట్యము త్యాగరాజ కృతులు వేమన పద్యాలను చిన్నప్పటి నుండి విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.యాభై మందికి పైగా కవులు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెరసం తరఫున ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సం చాలకులు మాడభూషి సంపత్ కుమార్ ని , పద్యకవి చీమకుర్తి వెంకటేశ్వర్ రావు ని,
సాహితీ వేత్త వేదం సూర్యప్రకాష్ రావుని
గురుకృపాకళా క్షేత్రం నాట్య గురువు శ్రీమతి సురభి గాయత్రిని, ప్రముఖ గాయని
వినయ రెడ్డి చేజర్లని
ఉగాది పురస్కారం తో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ కార్యదర్శి కుమార్ రాజా,తోట సులోచన అతిధులుగా పాల్గొన్నారు..ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్ అధ్యక్షత వహించాడు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు చేసిన నృ త్యాలను అందరూ అభినందించారు.బాలకవులు సైతం కవితలు వినిపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *