संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

కుంకువారి పాలెం లో తెదేపా ఆవిర్భావ వేడుకలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కుంకువారి పాలెం లో తెదేపా ఆవిర్భావ వేడుకలు

खबर की मुख्य बातें

  • తెలుగుదేశం పార్టీ 44వఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొండాపురం మండలం కుంకువారిపాలెంలో సీనియర్ నేత బొట్లగుంట హరిబాబు ఘనంగా నిర్వహించారు.
  • ఆదివారం ఉదయం , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో పార్టీ పతాకo ఆవిష్కరించిన అనంతరం హరిబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీఅని.
  • "సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు" అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ 44వఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొండాపురం మండలం కుంకువారిపాలెంలో సీనియర్ నేత బొట్లగుంట హరిబాబు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో పార్టీ పతాకo ఆవిష్కరించిన అనంతరం హరిబాబు మాట్లాడుతూ
తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీఅని. “సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు” అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా,సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు అందరికీ హరిబాబు శుభాకాంక్షలు తెలిపారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *