సాహితీ సన్మిత్రులందరికీ శుభోదయం, నమస్సుమాంజలి.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెల సగౌరవంగా నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు కు మీ అందరికీ పునఃస్వాగతం.
ఎంతో మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషక దాతలు ఇచ్చిన స్ఫూర్తితో మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన ఈ సాహిత్య సదస్సు, దిన దినాభివృద్ధి చెందుతూ, సాహిత్య శోభ ను వెదజల్లుతూ, భావితరానికి స్పూర్తిదాయకమై, నిరాటంకంగా కొనసాగుతుంది.
“నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు 216 వ మైలు రాయి మరియు 18వ వార్షికోత్సవం ని చేరుకున్న తరుణంలో, శనివారం జూలై 19 న సంగీత, సాహిత్య నృత్య సమ్మేళనం గా నిర్వహించబడుతుంది.
పాలడుగు శ్రీచరణ్ గారిచే సంస్కృతాంధ్ర ఏకాదశావధానం
కళారత్న కె.వి.సత్యనారాయణ గారిచే కాలార్చన కూచిపూడి నృత్య రూపకము మరియు
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారిచే అనువాద పర్వం,
ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారిచే యంత్రానువాద వ్యవస్థలు పై ప్రసంగాలు
ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖించదగిన అద్వితీయమైన ఘట్టం లో భాగం కావలసిందిగా కోరుతున్నాము.
తేదీ: శనివారం , జూలై 19 , 2025 సమయం: 11:30 నుండి
good
good for change