संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నెల్లూరులో డీజీపీ పర్యటన.. చిన్నబజార్ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నెల్లూరులో డీజీపీ పర్యటన.. చిన్నబజార్ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

खबर की मुख्य बातें

  • నెల్లూరు: రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నెల్లూరు జిల్లాలో పర్యటించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
  • నగరంలోని చిన్నబజార్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఐజీ త్రిపాఠి, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల పాల్గొన్నారు.
  • అనంతరం నూతన పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వసతులను డీజీపీ పరిశీలించారు.

నెల్లూరు: రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నెల్లూరు జిల్లాలో పర్యటించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని చిన్నబజార్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఐజీ త్రిపాఠి, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల పాల్గొన్నారు. అనంతరం నూతన పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వసతులను డీజీపీ పరిశీలించారు. భవనంలోని వివిధ విభాగాలు, ప్రజలకు అందించే సేవల గురించి అధికారులు వివరించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఆధునిక సౌకర్యాలతో పోలీస్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించడంతో పాటు, పోలీస్ సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *