Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Chittoor

నెల్లిమందలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం: రోడ్ల పక్కనే ముళ్లకంచెలు, పిచ్చిమొక్కలు

Punnami Newsroom Published:
నెల్లిమందలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం: రోడ్ల పక్కనే ముళ్లకంచెలు, పిచ్చిమొక్కలు

నెల్లిమంద (సోమల), అక్టోబర్ 12 (భాను ప్రసాద్ నాయుడు, పున్నమి న్యూస్ ప్రతినిధి):
సోమల మండలంలోని నెల్లిమంద గ్రామ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ వీధుల్లో పారిశుధ్య పనులు సక్రమంగా జరగకపోవడంతో రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు, కంపచెట్లు ఏపుగా పెరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి.
రోడ్డుకు ఇరువైపులా ఎండిన చెట్ల కొమ్మలతో కూడిన ముళ్లకంచెలు, మట్టి దిబ్బలు రాళ్ళు పేరుకుపోవడంతో వీధులు ఇరుకుగా మారి కాలినడకన వెళ్లే గ్రామస్థులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో విషపురుగులు, పాములు సంచరించే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధుల్లో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేసి గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని నెల్లిమంద గ్రామస్థులు కోరుతున్నారు.

నెల్లిమందలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం: రోడ్ల పక్కనే ముళ్లకంచెలు, పిచ్చిమొక్కలు

నెల్లిమందలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం: రోడ్ల పక్కనే ముళ్లకంచెలు, పిచ్చిమొక్కలు

నెల్లిమందలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం: రోడ్ల పక్కనే ముళ్లకంచెలు, పిచ్చిమొక్కలు

నెల్లిమందలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం: రోడ్ల పక్కనే ముళ్లకంచెలు, పిచ్చిమొక్కలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *