Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rangareddy

నీట్ పీజీ పరీక్షకు పటిష్ఠ భద్రత పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ రాజు, ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి

Punnami Newsroom Published:
నీట్ పీజీ పరీక్షకు పటిష్ఠ భద్రత పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ రాజు, ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి

నీట్ పీజీ పరీక్షకు పటిష్ఠ భద్రత

పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ రాజు, ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26: ఈ నెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు బుధవారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ ఏసీపీ రాజు, ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి శ్రీ చక్ర కాలేజీ TCS iON Digitalలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని సీసీటీవీ కెమెరాల పనితీరు, పార్కింగ్ సదుపాయాలు, అభ్యర్థుల ప్రవేశం–నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

అభ్యర్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా పరీక్ష పూర్తయ్యే వరకు అవసరమైన వసతులు, పార్కింగ్, రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించేలా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

నీట్ పీజీ పరీక్ష సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇబ్రహీంపట్నం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

నీట్ పీజీ పరీక్షకు పటిష్ఠ భద్రత పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ రాజు, ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *