Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nirmal

నిర్మల్‌లో వాకింగ్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల పరిశీలనకు కలెక్టర్ హామీ

Punnami Newsroom Published:
నిర్మల్‌లో వాకింగ్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల పరిశీలనకు కలెక్టర్ హామీ

Story highlights

  • రూ.6 కోట్ల నిధుల వినియోగంపై విచారణ జరిపించాలి: ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ నిర్మల్, అక్టోబర్ 19: నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, వాకింగ్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్…
  • ఈ సమస్యలపై 2024 నుంచి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
  • పట్టణంలోని షాపింగ్ మాల్స్‌ కారణంగా ఫుట్‌పాత్‌లపై అడ్డంకులు ఏర్పడుతున్నాయని, దీంతో పాదచారులు ఫుట్‌పాత్‌లను వినియోగించుకోలేక రోడ్లపై నడవాల్సి వస్తోందని వివరించారు.

రూ.6 కోట్ల నిధుల వినియోగంపై విచారణ జరిపించాలి: ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్
నిర్మల్, అక్టోబర్ 19: నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, వాకింగ్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యలపై 2024 నుంచి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
పట్టణంలోని షాపింగ్ మాల్స్‌ కారణంగా ఫుట్‌పాత్‌లపై అడ్డంకులు ఏర్పడుతున్నాయని, దీంతో పాదచారులు ఫుట్‌పాత్‌లను వినియోగించుకోలేక రోడ్లపై నడవాల్సి వస్తోందని వివరించారు. దీనివల్ల ప్రజలకు, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వెళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఫుట్‌పాత్‌ల నిర్మాణం కోసం కేటాయించిన రూ.6 కోట్ల నిధుల వినియోగంపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. నిధుల ఖర్చు, పనుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సయ్యద్ హైదర్ వినతిపై స్పందించిన కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాకింగ్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల పరిస్థితిని పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, అడ్డంకులను తొలగించి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సయ్యద్ హైదర్ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ వినోద్, జిల్లా కోశాధికారి అబ్దుల్ సాదిక్, పట్టణ అధ్యక్షుడు రవి, అధికార ప్రతినిధి వసంత్ రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి మెరుగు రాజన్న, చొక్కాల భూమన్న, న్యాయవాది అరవింద్, షేక్ ఇమామ్, షేక్ షాదుల్లాతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *