ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ತಿರುಪತಿ

నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఘోరం. మూతపడిన ఎక్స్-రే రూమ్. పేషెంట్ల అవస్థలు.

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఘోరం. మూతపడిన ఎక్స్-రే రూమ్. పేషెంట్ల అవస్థలు.

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • నాయుడుపేట, తేది:19-08-2026, ప్రత్యేక కధనం: ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఉచిత వైద్యం అందుతుందని ఆశపడే పేద రోగులకు తిరుపతి జిల్లా, నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది బాధ్యతారాహిత్యం శాపంగా మారింది.
  • మంగళవారం (18-08-2026) మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయానికి ఎక్స్-రే రూమ్‌కు బయటి నుంచి తాళాలు వేసి ఉండటం సంబంధిత అధికారుల తీవ్ర వైఫల్యం అని చెప్పవచ్చు.
  • వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన ఆసుపత్రి వేళల్లోనే ఎక్స్-రే విభాగానికి తాళాలు దర్శనమివ్వడంతో, అక్కడికి వచ్చిన రోగులు, వారి బంధువులు తీవ్ర విస్మయానికి గురయ్యారు.

నాయుడుపేట, తేది:19-08-2026, ప్రత్యేక కధనం:

ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఉచిత వైద్యం అందుతుందని ఆశపడే పేద రోగులకు తిరుపతి జిల్లా, నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది బాధ్యతారాహిత్యం శాపంగా మారింది. మంగళవారం (18-08-2026) మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయానికి ఎక్స్-రే రూమ్‌కు బయటి నుంచి తాళాలు వేసి ఉండటం సంబంధిత అధికారుల తీవ్ర వైఫల్యం అని చెప్పవచ్చు. వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన ఆసుపత్రి వేళల్లోనే ఎక్స్-రే విభాగానికి తాళాలు దర్శనమివ్వడంతో, అక్కడికి వచ్చిన రోగులు, వారి బంధువులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించలేక పేషెంట్ల బంధువులు తాళం వేసి ఉన్న ఎక్స్-రే రూమ్‌ను తమ ఫోన్లలో చిత్రీకరించారు.

“అసలు తాళాలు వేసి ఎక్స్-రే తీస్తారా? లేక రోజంతా అసలు ఎక్స్-రే రూమే తెరవలేదా?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సేవలు అందించాల్సిన విభాగం ఇలా తాళాల వెనుక మూలుగుతుంటే పర్యవేక్షణ చేయాల్సిన వైద్యాధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి బాధ్యతారహిత సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గమనిక: నాయుడుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న అక్రమాలు, నిర్లక్ష్య వైఖరి మరియు ప్రజలను విస్తుపోయేలా చేసే మరిన్ని సంచలనాత్మక సంఘటనలను ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా త్వరలోనే మీ ముందుకు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *