संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
महबूबाबाद

నవంబర్ 6 చివరి గడువు.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నవంబర్ 6 చివరి గడువు.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

खबर की मुख्य बातें

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి!
  • నవంబర్ 6 చివరి గడువు..
  • అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన పట్టభద్రులు వెంటనే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి!

నవంబర్ 6 చివరి గడువు.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన పట్టభద్రులు వెంటనే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. వరంగల్–ఖమ్మం–నల్గొండ, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటరు నమోదు దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.

ముఖ్యంగా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినవారు కూడా ఈసారి తప్పనిసరిగా కొత్తగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ అసెంబ్లీ, పార్లమెంట్ ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు లభించదు.

2023 అక్టోబర్ 31 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా అర్హత కలిగిన సమాన విద్యార్హత పూర్తి చేసిన వారు, సంబంధిత నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసులుగా ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

కావున మరిపెడ మండలంతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని అర్హులైన పట్టభద్రులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకొని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

ప్రజలందరికీ విజ్ఞప్తి: ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులు, పట్టభద్రులు, యువతకు షేర్ చేసి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించండి.

ఇట్లు,
భూక్య రాము నాయక్
పున్నమి రిపోర్టర్
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *