संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా దుత్తలూరులో మెగా రక్తదాన శిబిరం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా దుత్తలూరులో మెగా రక్తదాన శిబిరం
oplus_6291458

Date 20-9-2026
దుత్తలూరు(పున్నమి ప్రతినిధి ఉస్మాన్ )
దుత్తలూరు : ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని దుత్తలూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో BLO ఓరుగంటి మాధవరావు, దుత్తలూరు మండల బీజేపీ అధ్యక్షులు లెక్కల వెంగళరెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు పేమ్మసాని వేణుగోపాల్ తొ పాటు మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రక్తదానం చేసిన దాతలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడేలా రక్తదానం చేయడం సామాజిక బాధ్యతలో భాగమని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు రక్తదాతలకు ధ్రువపత్రాలు అందజేశారు. శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా దుత్తలూరులో మెగా రక్తదాన శిబిరం

నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా దుత్తలూరులో మెగా రక్తదాన శిబిరం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *