खबर की मुख्य बातें
- దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి: ఉమ్మగాని పద్మ ఎల్లగౌడ్ తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గామాత దేవి నవరాత్రి ఉత్సవాలకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేయూత అందించారు.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఉమ్మగాని పద్మ ఎల్లగౌడ్ సహకారంతో గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి ఉత్సవాల నిర్వహణ కోసం రూ.10 వేల నగదును అందజేశారు.
- ఈ సందర్భంగా ఉమ్మగాని పద్మ ఎల్లగౌడ్ మాట్లాడుతూ, దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, దుర్గామాత నవరాత్రులు భక్తి, శక్తి, ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు రూ.10 వేల ఆర్థిక సహాయం
ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి: ఉమ్మగాని పద్మ ఎల్లగౌడ్
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గామాత దేవి నవరాత్రి ఉత్సవాలకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేయూత అందించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఉమ్మగాని పద్మ ఎల్లగౌడ్ సహకారంతో గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి ఉత్సవాల నిర్వహణ కోసం రూ.10 వేల నగదును అందజేశారు.
ఈ సందర్భంగా ఉమ్మగాని పద్మ ఎల్లగౌడ్ మాట్లాడుతూ, దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, దుర్గామాత నవరాత్రులు భక్తి, శక్తి, ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు.
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో పండుగలను జరుపుకోవడం మన సంప్రదాయమని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా జరగాలని, అమ్మవారి కృపాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉత్సవ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
దసరా పండుగ శుభాకాంక్షలు: విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, అభివృద్ధి, సుఖశాంతులు తీసుకురావాలని, తెలంగాణ ప్రజలందరూ సిరిసంపదలతో వర్ధిల్లాలని ఉమ్మగాని పద్మ ఎల్లగౌడ్ ఆకాంక్షించారు.
— ఉమ్మగాని పద్మ ఎల్లగౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, గుర్తూరు గ్రామం, తొర్రూరు మండలం, పాలకుర్తి నియోజకవర్గం.