Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

దుర్గమ్మను దర్శించుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

Punnami Newsroom Published:
దుర్గమ్మను దర్శించుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు, శ్రీమతి శిరీష గారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దంపతులు.

ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్ష.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 19.10.2026.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, వారి సతీమణి శ్రీమతి శిరీష గారు, బంధుమిత్రులతో కలిసి సోమవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గాదేవిని దర్శించుకున్నారు.

మహిషాసురమర్ధిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో దంపతులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ, విజయదశమి పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శుభాలు నింపాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

ఎల్నినో పరిస్థితులను అమ్మవారి దయతో సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

దుర్గమ్మను దర్శించుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *