Story highlights
- ఓబులవారిపల్లి: రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం జీవీపురం గ్రామంలో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్యకు పరిష్కారం లభించింది.
- గ్రామంలోని ఆర్చ్ నుంచి శివాలయం వరకు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రహదారి పనులకు రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.
- ఏళ్లుగా సరైన రహదారి లేక గ్రామస్థులు, శివాలయానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఓబులవారిపల్లి: రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం జీవీపురం గ్రామంలో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలోని ఆర్చ్ నుంచి శివాలయం వరకు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రహదారి పనులకు రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.
ఏళ్లుగా సరైన రహదారి లేక గ్రామస్థులు, శివాలయానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన సిమెంట్ రహదారి నిర్మాణంతో ప్రజల రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు ఆలయానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు తొలగనున్నాయి. రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.