संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌గా అమర్ దీక్షిత్ బీజేపీ కృష్ణ మండల శాఖ హర్షం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌గా అమర్ దీక్షిత్ బీజేపీ కృష్ణ మండల శాఖ హర్షం

खबर की मुख्य बातें

  • కృష్ణ మండలం: కృష్ణ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అమర్ దీక్షిత్ దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌గా నియమితులయ్యారు.
  • ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడటంతో బీజేపీ కృష్ణ మండల శాఖ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
  • ఉమ్మడి పాలమూరు జిల్లా రైల్వే ప్రయాణికుల సమస్యలు, రైళ్ల రాకపోకలు, అవసరమైన సౌకర్యాల కల్పన కోసం అమర్ దీక్షిత్ పలుమార్లు రైల్వే అధికారులు, ఎంపీ డీకే అరుణ, మంత్రుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారని నాయకులు తెలిపారు.

కృష్ణ మండలం: కృష్ణ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అమర్ దీక్షిత్ దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడటంతో బీజేపీ కృష్ణ మండల శాఖ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా రైల్వే ప్రయాణికుల సమస్యలు, రైళ్ల రాకపోకలు, అవసరమైన సౌకర్యాల కల్పన కోసం అమర్ దీక్షిత్ పలుమార్లు రైల్వే అధికారులు, ఎంపీ డీకే అరుణ, మంత్రుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారని నాయకులు తెలిపారు. ఆయన సేవలను గుర్తించి ఎంపీ డీకే అరుణ సిఫారసు చేయడంతో ఈ నియామకం జరిగిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప, ప్రధాన కార్యదర్శులు దండు రాఘవేంద్ర, సచిన్ బట్‌తో పాటు జిల్లా నాయకులు సోంశేఖర్ గౌడ్, మజ్జిగ సురేష్, జెగ్గిలి ఉసేనప్ప, జి. శ్రీనివాసులు, నారాయణ బట్, డీకే కిష్టప్ప, మల్లారెడ్డి గౌడ్, సంజీవ్ రెడ్డి, ఒట్టేవోల్ల సురేష్, లక్ష్మి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *