Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

తౌశిక్, మౌలాభి మరణాలకు న్యాయం చేయాలి: టంగుటూరులో నిరసన

Punnami Newsroom Published: Updated:
తౌశిక్, మౌలాభి మరణాలకు న్యాయం చేయాలి: టంగుటూరులో నిరసన
oplus_6291456

టంగుటూరు: తౌశిక్, మౌలాభి మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత, ముస్లిం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టంగుటూరు నాలుగు రోడ్ల కూడలిలో నిరసన చేపట్టారు.జై భీమ్ రావ్ భారత్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కె.వి. కృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, తౌశిక్ మృతికి కారణమైన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, 10 ఎకరాల భూమి, రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు, విద్యాశాఖ అధికారులపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొగల్ కాలేశా బేగ్, AITUC, CITU, CPI నాయకులు, తుల్లిబిల్లి అశోక్ బాబు, ముస్లిం నాయకులు, కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు తదితరులు పాల్గొన్నారు.

తౌశిక్, మౌలాభి మరణాలకు న్యాయం చేయాలి: టంగుటూరులో నిరసన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *