संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
जनगांव

తెలంగాణ సినీ కవుల సింగిడి పుస్తకాన్ని అందుకున్న జి. కృష్ణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తెలంగాణ సినీ కవుల సింగిడి పుస్తకాన్ని అందుకున్న జి. కృష్ణ

खबर की मुख्य बातें

  • ‘తెలంగాణ సినీ కవుల సింగిడి’ పుస్తకాన్ని అందుకున్న జి.
  • కృష్ణ -------------------------------------------------------------------------- జనగామ, నవంబర్ 17,పున్నమి జిల్లా ప్రతినిధి తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిన డా.
  • తిరునగరి శరత్ చంద్ర రచించిన 95 మంది సినీ కవుల పరిచయ సంపుటి ‘తెలంగాణ సినీ కవుల సింగిడి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఘనంగా జరిగింది.‌ ఈ ప్రతిష్టాత్మక గ్రంథంలో‌ జనగామకు‌ చెందిన అభ్యుదయ రచయిత, సినీ గేయ కవి…

‘తెలంగాణ సినీ కవుల సింగిడి’ పుస్తకాన్ని అందుకున్న జి. కృష్ణ
————————————————————————–
జనగామ, నవంబర్ 17,పున్నమి జిల్లా ప్రతినిధి
తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిన
డా. తిరునగరి శరత్ చంద్ర రచించిన 95 మంది సినీ కవుల పరిచయ సంపుటి ‘తెలంగాణ సినీ కవుల సింగిడి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఘనంగా జరిగింది.‌ ఈ ప్రతిష్టాత్మక గ్రంథంలో‌ జనగామకు‌ చెందిన అభ్యుదయ రచయిత, సినీ గేయ కవి జి.వై. గిరి సినిమా పాటల పరిచయం 43వ పేజీలో ముద్రితమైంది. జి.వై.గిరి ‘ఆశాజ్యోతి’, ‘ధర్మవడ్డీ’, ‘దండోరా’ ‘పిల్లలు కాదు పిడుగులు’వంటి సామాజిక స్పృహ కలిగిన చిత్రాలకు అందించిన గీతాలు తెలుగు సినీ సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ సందర్భంగా తన తండ్రి జి.వై. గిరి పేరిట కుమారుడు కవులు కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు జి. కృష్ణ అతిథుల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, సుప్రసిద్ధ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ విమర్శకులు వారాల ఆనంద్, ప్రముఖ సినీ కవి మౌనశ్రీ మల్లిక్, జె.కె. భార్గవ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనగామ జిల్లా ‘కవులు, కళాకారుల ఐక్యవేదిక’ తరపున రచయిత డాక్టర్ తిరునగరి శరత్ చంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఐక్యవేదిక కోశాధికారి అయిలా సోమనర్సింహాచారి, గొలుసుల ఎల్లయ్య, తేజ గుడికందుల తదితరులు పాల్గొని రచయితకు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *