संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

తల్లిదండ్రుల శ్రమదానంతో పాఠశాలకు తాత్కాలిక ఇనుప కంచె

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తల్లిదండ్రుల శ్రమదానంతో పాఠశాలకు తాత్కాలిక ఇనుప కంచె

खबर की मुख्य बातें

  • Uploaded Video:

అరకులోయ మండలం బస్కీ పంచాయతీ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని గుగ్గుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం మోడల్ ప్రాథమిక పాఠశాలగా గుర్తించింది. ప్రస్తుతం 70 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రహరీ లేకపోవడంతో పశువులు, ఆకతాయిలు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు శ్రమదానం, ఆర్థిక సహకారంతో బుధవారం తాత్కాలికంగా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. పాఠశాలకు అదనపు భవనం నిర్మించాలని, మంచినీటి కొళాయి ఏర్పాటు చేయాలని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. ఎస్ఎంసీ చైర్మన్ పి.భీష్మ, ఎస్.సహదేవ్, ఎస్.రాందేవ్, కిలో సహదేవ్, జి.రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల శ్రమదానంపై హెచ్ఎమ్ ఎం.రామారావు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *