Story highlights
- పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కమిటీ ప్రకటన) (సమన్వయకర్తలుగా యల్లటూరు శ్రీనివాస రాజు, అతికారి కృష్ణ, రామ్ దాస్ చౌదరి, దాశం అనిత) రాజంపేట/మదనపల్లె, అక్టోబర్ 09 (పున్నమి న్యూస్ ప్రతినిధి): జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నూతన…
- పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్తలు, నిర్వాహక దళ్ సభ్యులను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
- రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్తలుగా శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు, శ్రీ అతికారి కృష్ణ, శ్రీ రామ్ దాస్ చౌదరి, శ్రీమతి దాశం అనిత నియమితులయ్యారు.
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కమిటీ ప్రకటన)
(సమన్వయకర్తలుగా యల్లటూరు శ్రీనివాస రాజు, అతికారి కృష్ణ, రామ్ దాస్ చౌదరి, దాశం అనిత)
రాజంపేట/మదనపల్లె, అక్టోబర్ 09 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నూతన కమిటీని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్తలు, నిర్వాహక దళ్ సభ్యులను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్తలుగా శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు, శ్రీ అతికారి కృష్ణ, శ్రీ రామ్ దాస్ చౌదరి, శ్రీమతి దాశం అనిత నియమితులయ్యారు. వీరితో పాటు పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది ముఖ్య నాయకులతో ‘నిర్వాహక దళ్’ కమిటీని, అలాగే ప్రత్యేక సపోర్ట్ టీమ్ను పార్టీ ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత క్రియాశీలకంగా నడిపించడం, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుందని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్కు ఈ సందర్భంగా నూతన సమన్వయకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.