ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು
- జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో రైతు ఎల్లబోయిన విష్ణువర్ధన్ బావి వద్ద గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేశాయి.
- ఈ ఘోర దాడిలో ఆరు గొర్రెల్లో మూడు గొర్రెలు మృతి చెందగా, మరో మూడు తీవ్రంగా గాయపడ్డాయి.
- అప్పులు చేసి కొనుగోలు చేసిన మూగజీవాలు ఇలా మృత్యువాత పడటంతో రైతు విష్ణువర్ధన్ కన్నీరుమున్నీరవుతున్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో రైతు ఎల్లబోయిన విష్ణువర్ధన్ బావి వద్ద గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘోర దాడిలో ఆరు గొర్రెల్లో మూడు గొర్రెలు మృతి చెందగా, మరో మూడు తీవ్రంగా గాయపడ్డాయి.
అప్పులు చేసి కొనుగోలు చేసిన మూగజీవాలు ఇలా మృత్యువాత పడటంతో రైతు విష్ణువర్ధన్ కన్నీరుమున్నీరవుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల బెడదతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. నష్టపోయిన పేద రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.