Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

చిట్వేలు–రాపూరు ఘాట్‌ రోడ్డులో చిరుతల కలకలం

Punnami Newsroom Published:
చిట్వేలు–రాపూరు ఘాట్‌ రోడ్డులో చిరుతల కలకలం

Story highlights

  • తిరుపతి జిల్లా చిట్వేలు నుంచి రాపూరు వెళ్లే ప్రధాన ఘాట్‌ రహదారిపై చిరుతల సంచారం తరచుగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని చిట్వేలు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పి.ధీరజ్‌ సూచించారు.
  • మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఘాట్‌ రహదారి, గోడలపై చిరుతలు సంచరిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వార్తలు, వీడియోలు వాస్తవమేనని తెలిపారు.
  • సుమారు 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన శ్రీ పెనుశిల అభయారణ్యంలో ఒక పెద్దపులితో పాటు సుమారు 20 చిరుతలు సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు.

తిరుపతి జిల్లా చిట్వేలు నుంచి రాపూరు వెళ్లే ప్రధాన ఘాట్‌ రహదారిపై చిరుతల సంచారం తరచుగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని చిట్వేలు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పి.ధీరజ్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఘాట్‌ రహదారి, గోడలపై చిరుతలు సంచరిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వార్తలు, వీడియోలు వాస్తవమేనని తెలిపారు. సుమారు 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన శ్రీ పెనుశిల అభయారణ్యంలో ఒక పెద్దపులితో పాటు సుమారు 20 చిరుతలు సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. నల్లమల, శేషాచల కొండల కలయికతో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం సాధారణమే అయినప్పటికీ, రహదారిపై వాటి కదలికలు పెరిగిన సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ప్రయాణించాలని, వీలైనంత వరకు రాత్రివేళల్లో ఈ మార్గంలో ప్రయాణించకుండా ఉండటం మంచిదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఘాట్‌ రోడ్డుకు సమీపంలోని గ్రామాల ప్రజలు కూడా మేకలు, గొర్రెలు, పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిరుతలు కనిపించినప్పుడు వాటిని వెంబడించడం, రెచ్చగొట్టడం లేదా ఎలాంటి హాని చేయడం చేయరాదని ధీరజ్‌ స్పష్టం చేశారు. వన్యప్రాణుల కదలికలు కనిపించినా ప్రజలు సురక్షిత దూరంలో ఉండి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *