Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

చర్మ వ్యాధుల వైద్య శిబిరం నేడు

Punnami Newsroom Published: Updated:
చర్మ వ్యాధుల వైద్య శిబిరం నేడు

Story highlights

  • సి.ఎస్‌.పురం బస్టాండ్‌ సెంటర్‌ ఇరువూరు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర వైద్యశాలలో నిర్వహణ పామూరు: చర్మ సంబంధిత వ్యాధుల నివారణ, చికిత్స కోసం ప్రముఖ చర్మ వ్యాధుల వైద్య నిపుణురాలు డాక్టర్‌ టి.
  • వనజ ఎం.బి.బి.ఎస్., ఎం.డి., డి.వి.ఎల్.
  • ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

సి.ఎస్‌.పురం బస్టాండ్‌ సెంటర్‌ ఇరువూరు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర వైద్యశాలలో నిర్వహణ

పామూరు: చర్మ సంబంధిత వ్యాధుల నివారణ, చికిత్స కోసం ప్రముఖ చర్మ వ్యాధుల వైద్య నిపుణురాలు డాక్టర్‌ టి. వనజ ఎం.బి.బి.ఎస్., ఎం.డి., డి.వి.ఎల్. ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించనున్నారు. నెల్లూరులోని నివా ఆసుపత్రిలో కన్సల్టెంట్‌ చర్మ వ్యాధుల వైద్య నిపుణురాలిగా సేవలందిస్తున్న డాక్టర్‌ టి. వనజ ఈ శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, చికిత్స అందించనున్నారు. సి.ఎస్‌.పురం బస్టాండ్‌ సెంటర్‌ ఇరువూరు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర వైద్యశాలలో అక్టోబర్‌ 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వైద్య శిబిరం నిర్వహించనున్నారు. చిన్నపిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు, వర్ణద్రవ్య సంబంధిత చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు, గోళ్ల సమస్యలు, బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తదితర చర్మ సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, చికిత్స అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు: 9703246448, 9963273287.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *