Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపు

Punnami Newsroom Published:
చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపు

Story highlights

  • చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం - ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు - సారంగధర మెట్టపై కల్యాణ మండపం నిర్మాణం - కల్యాణ మండపం కోసం రూ.
  • 2.50 లక్షలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి...
  • రూ.

చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు
– సారంగధర మెట్టపై కల్యాణ మండపం నిర్మాణం
– కల్యాణ మండపం కోసం రూ. 2.50 లక్షలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి… రూ. 9 లక్షలు ఆలయ చైర్మన్ సాయి విరాళాలు
రాజమహేంద్రవరం :
మనం చేసే పనులు, కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. సారంగధర మెట్టపై ఉన్న శ్రీ సారంగధేశ్వరస్వామి ఆలయానికి నూతనంగా నియమించినబడిన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం బుధవారం జరిగింది. చైర్మన్ గా కెవీడీఎస్సీవి చౌదరి, డైరెక్టర్లుగా కొలచన వెంకట సూర్య నారాయణ, అజ్జరపు శ్యామలాదేవి, సూరంపూడి అప్పాజీ, పొన్నమాటి నాగమణి, డేగల మరియ్య, రేలంగి నాగేశ్వరరావు, కుమారి శాంతకుమారి, నూకల అచ్యుతరామయ్య, ప్రమాణస్వీకారం చేశారు. వారితో ఆలయ ఈఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు వారి శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా ఒక కల్యాణ మండపాన్ని నిర్మించనున్నామని తెలిపారు. అందుకోసం తాము తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ నుంచి రూ. 2.50 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే సారంగదేశ్వర స్వామి ఆలయానికి నూతనంగా చైర్మన్ గా నియమితులైన సాయి కుటుంబం రూ. 9 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాగా కూటమి అధికారంలోకి రావడాన్ని కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి టీడీపీకి బలమైన నియోజకవర్గమన్నారు గతంలో ఎన్నడూ రాని మెజార్టీ వచ్చిందన్నారు. కూటమి విజయం కోసం కృషి చేసిన అందరికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఎండోమెంట్ కమిటీలను ముందుగానే వేయడం జరుగుతొందన్నారు. ఆలయ పరిరక్షణకు కృషి చేస్తూ భక్తులకు మంచి సేవలు అందించాలని ఆలయ నూతన కమిటీ సభ్యులకు సూచించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో గంజాయి, బ్లెడ్ లను బ్యాచ్ లను నియంత్రించినట్టు తెలిపారు. దేవాదాయ స్థలాల్లో ఉన్న వారికి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుందన్నారు. నగరంలో అన్ని సమస్యలు తీరుస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను మాట్లాడుతూ వైకాపా రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజమహేంద్రవరంలోనే ముందుగా దేవాలయాలకు కమిటీలు చేయడం జరుగుతోందని, ఆలయాల పవిత్రతను కాపాడాల ఆయా కమిటీలకు పిలుపునిచ్చారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన, 47వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ బేసరి చిన్ని పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దొండపాటి సత్యంబాబు, వర్రే శ్రీనివాసరావు, యిన్నమూరి దీపు, నల్లం శ్రీను, ఉప్పులూరి జానకి రామయ్య, మరుకుర్తి రవి యాదవ్, శెట్టి జగదీష్, జామి సత్యనారాయణ, నిమ్మలపూడి గోవింద్, మొకమాటి సత్యనారాయణ, దాస్యం ప్రసాద్, తురకల నిర్మల, పిల్లి శ్యామ్, కందికొండ అనంత్, కానేటి కృపామణి, సలాది ఆనంద్, బొర్రా చిన్ని, కవులూరి వెంకట రావు, చింతపల్లి నాని, మళ్ల వెంకట రాజు, గుదే రఘు నరేష్, దుత్తరపు గంగాధర్, చాపల చిన్న రాజు, కానేటి ప్రభు దాస్, మదినా సాహెబ్, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *