संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

*ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి వేడుకలు,,, ఈ సందర్భంగా పొదలకూరు బస్టాండ్ వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు,,,,,*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
*ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి వేడుకలు,,, ఈ సందర్భంగా పొదలకూరు బస్టాండ్ వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు,,,,,*

खबर की मुख्य बातें

  • కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకుని పొదలకూరు స్థానిక బస్టాండ్ సెంటర్ నందు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
  • ఈ సందర్భంగా సుందరయ్య, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా సిపిఎం ఏరియా బాద్యులు అల్లాడి గోపాల్ మాట్లాడుతూ,, ​సుందరయ్య చిన్ననాటి నుంచే కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త.

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకుని
పొదలకూరు స్థానిక బస్టాండ్ సెంటర్ నందు
మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుందరయ్య, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం ఏరియా బాద్యులు అల్లాడి గోపాల్ మాట్లాడుతూ,,
​సుందరయ్య చిన్ననాటి నుంచే కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త.
​కుల సమానత్వం కోసం తన పేరు చివర ఉన్న ‘రెడ్డి’ అనే తోకను తొలగించుకుని, కేవలం సుందరయ్యగా చరిత్రలో నిలిచారు.
​పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ, సైకిల్‌పై వెళ్లి రాజకీయాల్లో అత్యున్నత నిరాడంబర విలువలను నెలకొల్పిన మహోన్నత నాయకుడు ఆయన. అని పేర్కొన్నారు,
కామ్రేడ్ ​మనోహర్ (మండల కార్యదర్శి): మాట్లాడుతూ
​దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల, కూలీల రేట్ల పోరాటాలకు నాంది పలికిన నాయకుడు సుందరయ్య గ
​దేశ ప్రజలనే తన పిల్లలుగా భావించి, సంతానం కూడా వద్దనుకుని, తన సర్వస్వాన్ని పీడిత ప్రజల కోసం, దేశం కోసం అర్పించిన త్యాగధనుడు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రంగయ్య, తిరుపాలుతో పాటు ఆటో కార్మికులు నాగార్జున, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, మరియు హమాలీ వర్కర్స్ వెంకటేశ్వర్లు, మణి , ప్రసాద్, తిరుపాల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *