ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಅನ್ನಮಯ್ಯ

గుర్తింపు కార్డులు బాధ్యతకు ప్రతీక

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
గుర్తింపు కార్డులు బాధ్యతకు ప్రతీక

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • రాయచోటి: పార్టీ శ్రేణులంతా కుటుంబ సభ్యుల్లా కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
  • రాయచోటి మండలం వరిగ పాపిరెడ్డిగారిపల్లె గ్రామంలో వివిధ కమిటీల్లో పదవులు పొందిన వారికి శుక్రవారం బోస్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
  • కార్యక్రమంలో హిందూపురం పరిశీలకులు రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

రాయచోటి: పార్టీ శ్రేణులంతా కుటుంబ సభ్యుల్లా కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటి మండలం వరిగ పాపిరెడ్డిగారిపల్లె గ్రామంలో వివిధ కమిటీల్లో పదవులు పొందిన వారికి శుక్రవారం బోస్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హిందూపురం పరిశీలకులు రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గుర్తింపు కార్డులు పార్టీ బాధ్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. గుర్తింపు కార్డులు పొందిన పార్టీ శ్రేణులకు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.5 లక్షల పరిహారం అందించే భరోసా పార్టీ కల్పిస్తోందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడ్డాయని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కరువు పరిస్థితులతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడం ద్వారా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు.

కూటమి పాలనలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి దూరమయ్యాయని వైఎస్సార్‌సీపీ హిందూపురం పరిశీలకులు రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. తాగునీరు, సాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *