Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rajanna Sircilla

క్రికెట్‌లో జాతీయ స్థాయికి నామాపూర్ విద్యార్థిని

Punnami Newsroom Published:
క్రికెట్‌లో జాతీయ స్థాయికి నామాపూర్ విద్యార్థిని

Story highlights

  • గూడెపు వంశికకు ఘన సన్మానం..
  • అభినందించిన సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గం నామాపూర్: క్రికెట్‌లో జాతీయ స్థాయికి ఎంపికై నామాపూర్ గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని గూడెపు వంశికకు గ్రామపంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది.
  • జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్ తాడెపు కొమురయ్యతో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు వంశికను అభినందించారు.

గూడెపు వంశికకు ఘన సన్మానం.. అభినందించిన సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గం

నామాపూర్: క్రికెట్‌లో జాతీయ స్థాయికి ఎంపికై నామాపూర్ గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని గూడెపు వంశికకు గ్రామపంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్ తాడెపు కొమురయ్యతో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు వంశికను అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ ఉన్నత స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. వంశిక సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *