Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

కోటి మీ ప్రభుత్వం అభివృద్ధికి కొండపల్లి అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Punnami Newsroom Published:
కోటి మీ ప్రభుత్వం అభివృద్ధికి కొండపల్లి అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

*కూటమి ప్రభుత్వంతోనే కొండపల్లి అభివృద్ధి సాధ్యం*

*కూటమి అభ్యర్థులను గెలిపించండి.. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్*

కొండపల్లి మున్సిపాలిటీలో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా చైర్మన్ అభ్యర్థి కన్నెకంటి అమూల్య, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తేనే పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.

వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయడం వల్ల అభివృద్ధికి ప్రయోజనం ఉండదని, కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా కొండపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లవచ్చని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ కొండపల్లి అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి చేయలేకపోయిన జోగి రమేష్‌కు కొండపల్లి మున్సిపాలిటీలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

కోటి మీ ప్రభుత్వం అభివృద్ధికి కొండపల్లి అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *