Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

కొత్తపేట ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం! నారా లోకేష్ పరామర్శ.

Punnami Newsroom Published:
కొత్తపేట ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం! నారా లోకేష్ పరామర్శ.

Story highlights

  • డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కు తృటిలో ప్రమాదం తప్పింది.
  • ఆలమూరులో రైతు సంబరాలు వేడుకలకు బుధవారం ఆయన విచ్చేశారు.
  • వేలాదిగా తరలివచ్చిన రైతుల మధ్యన ఎడ్ల బండి ఎక్కి నినాదాలు చేస్తున్నారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆలమూరులో రైతు సంబరాలు వేడుకలకు బుధవారం ఆయన విచ్చేశారు. వేలాదిగా తరలివచ్చిన రైతుల మధ్యన ఎడ్ల బండి ఎక్కి నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో బండి కి కట్టిన బెలూన్లు పేలాయి. దీంతో ఎద్దులు ఒక్కసారిగా రంకెలు వేసాయి. అంతే ఆ బండి మీద ఉన్న ఎమ్మెల్యే బండారు తో పాటు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు తదితరులు ఒకసారిగా కింద పడిపోయారు. అయితే సతీష్ కాలుకు ప్యాచ్చర్ కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే బండారు బండిని చాకచక్యంగా పట్టుకోవడం వల్ల ఆయనకు ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలు అయ్యాయి. అయినప్పటికీ యధావిధిగా రైతు సంబరాలు వేడుకల్లో ఆయన పాల్గొని రైతులకు సందేశం ఇచ్చారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్ చార్జి మంత్రి అచ్చంనాయుడు, కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు,పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఫోన్లో ఎమ్మెల్యే బండారును పరామర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *