Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

కొండపల్లి ఎన్నికల ప్రచారంలో కదం తొక్కిన కూటమి సైనికులు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

Punnami Newsroom Published:
కొండపల్లి ఎన్నికల ప్రచారంలో కదం తొక్కిన కూటమి సైనికులు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

కొండపల్లిలో కదం తొక్కిన కూటమి సైనికులు.

ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి భారీ జనసందోహంతో ర్యాలీ.

కూటమి విజయమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు.

ర్యాలీలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, అక్టోబర్ 30:

కొండపల్లి మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడంతో ర్యాలీ సందడిగా సాగింది.

కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐకమత్యాన్ని చాటుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల నుంచి లభించిన స్పందనతో కొండపల్లి మున్సిపాలిటీలో కూటమి విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంగా ముందుకు సాగింది. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డుల్లో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కొండపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక కృషి.

కొండపల్లి మున్సిపాలిటీ ఆవిర్భావం నుంచి పట్టణ అభివృద్ధి వరకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నారని కూటమి నాయకులు పేర్కొన్నారు. కొండపల్లి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, వార్డులవారీగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కూటమి అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. పట్టణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు.

కూటమి ఐక్యతకు ప్రతీకగా భారీ ర్యాలీ

ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ఐక్యతను చాటారు. ప్రజల భాగస్వామ్యం, కార్యకర్తల ఉత్సాహం ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కొండపల్లి మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సాగిన ఈ ర్యాలీ ఎన్నికల ప్రచారంలో కీలక ఘట్టంగా నిలిచింది. భారీ జనసందోహంతో సాగిన ర్యాలీ కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. కొండపల్లి అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ, 40 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.

కొండపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ కూటమి అభ్యర్థి కన్నెగంటి అమూల్య గారితో పాటు మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ), గారు పాల్గొన్నారు.

కొండపల్లి ఎన్నికల ప్రచారంలో కదం తొక్కిన కూటమి సైనికులు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

కొండపల్లి ఎన్నికల ప్రచారంలో కదం తొక్కిన కూటమి సైనికులు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *