Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

కొండపల్లి అభివృద్ధికి 25 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Punnami Newsroom Published:
కొండపల్లి అభివృద్ధికి 25 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

కొండపల్లి అభివృద్ధికి రూ.25 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన.

13 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఆధునిక మున్సిపల్ కార్యాలయం, మూడు పార్కుల నిర్మాణానికి శ్రీకారం.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు.

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 13/10/2026:

కొండపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు రూ.25 కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు తెలిపారు. మంగళవారం కొండపల్లి మున్సిపాలిటీలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ.. పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజలకు అవసరమైన రహదారులు, పరిపాలనా సదుపాయాలు, ఆహ్లాదకరమైన పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

రూ.25 కోట్లతో కీలక అభివృద్ధి పనులు

కొండపల్లి మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో సుమారు 13 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.16.62 కోట్లు కేటాయించామని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. ఆధునిక వసతులతో మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.3.36 కోట్లు, మూడు పార్కుల నిర్మాణం, అభివృద్ధికి రూ.5.02 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. మొత్తంగా రూ.25 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు

వివిధ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు అన్నారు. అంతర్గత రహదారుల అభివృద్ధితో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు స్థానికంగా ఎదురవుతున్న రహదారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆధునిక మున్సిపల్ కార్యాలయం ద్వారా పరిపాలనా కార్యకలాపాలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం

మూడు పార్కుల నిర్మాణం, అభివృద్ధితో కొండపల్లి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. పిల్లలు, యువత, వృద్ధులు సేదతీరేందుకు, కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు ఈ పార్కులు ఉపయోగపడతాయని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో రహదారులతో పాటు ప్రజల జీవన నాణ్యతను పెంచే సదుపాయాలకూ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలి

ప్రజాధనంతో చేపట్టే ప్రతి అభివృద్ధి పనీ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ఉండాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనులు నాణ్యతతో పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

కొండపల్లి అభివృద్ధికి 25 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

కొండపల్లి అభివృద్ధికి 25 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *