संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
महबूबाबाद

కురవి మండలంలో ఆర్టీఏ కొరడా.. బడి పిల్లల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కురవి మండలంలో ఆర్టీఏ కొరడా.. బడి పిల్లల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు!

खबर की मुख्य बातें

  • *కురవి మండలంలో ఆర్టీఏ కొరడా..
  • బడి పిల్లల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు!* *ఓవర్‌లోడ్ ఆటోలు సీజ్..
  • సరైన పత్రాలు లేని వాహనాలపై చర్యలు* మహబూబాబాద్, నవంబర్ 3 | 2026; మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా బడి పిల్లలను తరలించే ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు వరుసగా రెండో రోజు తనిఖీలు…

*కురవి మండలంలో ఆర్టీఏ కొరడా.. బడి పిల్లల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు!*

*ఓవర్‌లోడ్ ఆటోలు సీజ్.. సరైన పత్రాలు లేని వాహనాలపై చర్యలు*

మహబూబాబాద్, నవంబర్ 3 | 2026;

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా బడి పిల్లలను తరలించే ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు వరుసగా రెండో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు. కురవి మండల కేంద్రంలో వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) శంకర్ నాయక్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు.

*ఓవర్‌లోడ్ వాహనాలు సీజ్*

విద్యార్థులను పరిమితికి మించి ఎక్కించుకొని వెళ్తున్న ఆటోలతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆర్‌సీ, ఎఫ్‌సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా వాహన యజమానులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

*తల్లిదండ్రులకు విజ్ఞప్తి*

తల్లిదండ్రులు తమ పిల్లలను ఓవర్‌లోడ్ ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాల్లో పాఠశాలలకు పంపించవద్దు. వాహనంలో పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తున్నారా? డ్రైవర్‌కు సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? వాహనానికి అవసరమైన పత్రాలు ఉన్నాయా? అనే విషయాలను పరిశీలించాలి. పిల్లలను సురక్షితంగా పాఠశాలకు పంపించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత.

*పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి*

పాఠశాలలకు విద్యార్థులను తీసుకువచ్చే ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, ఇతర రవాణా వాహనాలకు అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయో లేదో యాజమాన్యాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలి. డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకే విద్యార్థులను తరలించే బాధ్యత అప్పగించాలి. విద్యార్థుల భద్రతను విస్మరించవద్దని సూచిస్తున్నారు.

*వర్షాకాలంలో మరింత అప్రమత్తత అవసరం*

వర్షాల సమయంలో కరకట్టలు, చెరువు కట్టలు, బురద రహదారులు, జారుడు మార్గాల్లో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షం కారణంగా టైర్లు జారిపోయే ప్రమాదం ఉంది. వాహనం అదుపు తప్పడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. ముఖ్యంగా బడి పిల్లలను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లు వేగాన్ని తగ్గించి, రహదారి పరిస్థితులను గమనిస్తూ ప్రయాణించాలి.

ఈ ప్రత్యేక తనిఖీల కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు ఎస్. వెంకట్ రెడ్డి, ఖాసీం, సుందర్‌లాల్ పాల్గొని వాహనాలను తనిఖీ చేస్తూ నిబంధనలపై అవగాహన కల్పించారు.

విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రవాణా నిబంధనలు పాటించాలని, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, వాహన యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.

*మహబూబాబాద్ జిల్లా* *రవాణా శాఖ కార్యాలయం*

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *